Central Tribal University: సాలూరులో సెంట్రల్‌ ట్రైబల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Central Tribal University: గిరి జనులు ప్రపంచంతో పోటీపడతారన్న జగన్

Update: 2023-08-25 08:21 GMT

Central Tribal University: సాలూరులో సెంట్రల్‌ ట్రైబల్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

Central Tribal University: సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561 ఎకరాల్లో, 834 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకుంటున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన వర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీపడతారని జగన్ అన్నారు.

Tags:    

Similar News