Jagananna Thodu: రేపు 'జగనన్న తోడు' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
Jagananna Thodu: జగన్ బటన్ నొక్కగానే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ
జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)
Jagananna Thodu: సీఎం జగన్ రేపు జగనన్న తోడు కార్యక్రమాన్ని క్యాప్ ఆఫీస్‌లో ప్రారంభించనున్నారు. సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కగానే లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు అకౌంట్‌ల్లో డబ్బులు జమ కానున్నాయి. అధిక వడ్డీల భారం నుంచి చిరు వ్యాపారులను రక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం జగనన్నతోడు కార్యక్రమాన్ని చేపట్టింది.
గతేడాది నవంబర్‌లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన లబ్ధిదారులకు ఈ సారి 16కోట్ల 36లక్షల కోట్ల వడ్డీని జమ చేయనున్నారు. ఈ ఏడాది రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే లబ్ధిదారులకు సైతం రుణకాల పరిమితి ముగియగానే వడ్డీని తిరిగి చెల్లించనుంది ప్రభుత్వం. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10వేల చొప్పున ఇప్పటి వరకు 9లక్షల 5వేల 4వందల 58 మందికి 905కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించింది.