CM Jagan: ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్..
CM Jagan: 175 నియోజకవర్గాల అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో సీఎం జగన్
CM Jagan: ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్..
CM Jagan: వచ్చే ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల పనితీరుతో పాటు... ప్రజాధరణపై సీఎం జగన్ సర్వేలు చేయిస్తున్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. కాసేపట్లో పీకే టీంతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఇప్పటికే నియోజవర్గాల వారిగా పీకే టీం సర్వే పూర్తి చేసి రిపోర్టును సిద్ధంగా ఉంచింది.
ఇవాళ జరగనున్న భేటీలో రిపోర్టులను సీఎం జగన్‌కు పీకే టీం అందించనుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పని తీరు రిపోర్ట్‌తో పాటు నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాలిటీపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించనున్నారు. మీటింగ్ తర్వాత అభ్యర్థులు ఎంపికకు సంబంధించిన సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.