CM Jagan: నాలుగు పెళ్లిళ్లు చేసుకొని భార్యలను మార్చలేం.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ కౌంటర్ ఎటాక్
CM Jagan: నాలుగు పెళ్లిళ్లు చేసుకొని భార్యలను మార్చలేం
CM Jagan: పవన్‌కళ్యాణ్‌కు నిలకడ లేదు.. నోటికి అదుపులేదు
CM Jagan: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ లారీ ఎక్కి గుడ్డలు చించుకొని మాట్లాడుతున్నారని.. పవన్‌కు నిలకడ లేదు.. నోటికి అదుపులేదన్నారు. పవన్‌లా మనం నోటికొచ్చినట్లు మాట్లాడలేమన్నారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని భార్యలను మార్చలేమని.. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేమన్నారు. వారిలా పూనకం వచ్చినట్లు మాట్లాడలేమన్న సీఎం జగన్.. పొత్తుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు.
తన 45 ఏళ్ల రాజకీయంలో చంద్రబాబు ఏనాడూ మంచి గురించి ఆలోచించలేదు. టీడీపీని టీ అంటే తినుకో.. డీ అంటే దండుకో.. పీ అంటే పంచుకోగా మార్చేశారు. దోచుకున్న సొమ్ముతో వాళ్లు బొజ్జలు పెంచుకున్నారని ఎద్దేశా చేశారాయన. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో గభాంగా.. కురుపాం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌పైనా మండిపడ్డారు.