CM Jagan: పవన్‌కు భీమవరంతో సంబంధం లేదు.. గాజువాకతో అనుబంధం లేదు
CM Jagan: షూటింగ్‌ల మధ్య గ్యాప్‌లలో పవన్ వచ్చిపోతుంటారు
CM Jagan: పవన్‌కు భీమవరంతో సంబంధం లేదు.. గాజువాకతో అనుబంధం లేదు
CM Jagan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు దత్తపుత్రుడు ఇల్లు హైదరాబాద్‌లో ఉంటుందని.. కానీ, దత్తపుత్రుడు ఇంట్లో ఇల్లాలు మూడు, నాలుగేళ్లకు ఒకసారి మారిపోతుందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల పట్ల పవన్‌కు ఉన్న గౌరవం అదంటూ ఆరోపించారు. పవన్‌కు తాను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంతో సంబంధం లేదని, గాజువాకతో అనుబంధమూ లేదని చెప్పారు. తనను నమ్మిన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకోవడానికి షూటింగ్‌ల మధ్య గ్యాప్‌లలో పవన్ వచ్చిపోతుంటారని విమర్శించారు సీఎం జగన్.