హైకోర్టును అశ్రయించిన జగన్ తరుపు న్యాయవాదులు!

Update: 2019-11-01 08:34 GMT

తనపై పెండింగ్‌లో ఉన్న సీబీఐ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టుకు హాజరుకాకుండా వ్యక్తిగత మినహాయింపు కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.. దాంతో సీఎం తరుపు న్యాయవాదులు హైకోర్టును అశ్రయించినట్టు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా జగన్ మినహాయింపు పొందటానికి అర్హుడని.. కానీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది.. దాంతో సీఎం జగన్ తరుపు న్యాయవాదులు తీర్పుని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

కాగా సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ ఇప్పుడు సాధారణ రాజకీయ నాయకుడు కాదని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నారని.. రాష్ట్ర పరిపాలన కోసం వారమంతా ఆయన అవసరం ఉంటుందని.. అందుకోసం ప్రతి శుక్రవారం ట్రయల్ కోర్టుకు హాజరు కాలేడని జగన్ తరుపు న్యాయవాదులు వాదించారు.

Tags:    

Similar News