Chandrababu: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
Chandrababu: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Chandrababu: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చినరాజగోపురం వద్ద స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ సీఎంకు పరివేష్టం కట్టారు.