Vinukonda: వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి సీఐ కాల్పులు
Palnadu: మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులపై అక్రమ కేసులు నిరసిస్తూ టీడీపీ ర్యాలీ
Vinukonda: వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి సీఐ కాల్పులు
Palnadu: పల్నాడు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వినుకొండలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులపై అక్రమ కేసులు నిరసిస్తూ టీడీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అదే సమయంలో అక్కడకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వాహనం రాగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
టీడీపీ కార్యకర్తలను చూసి ఎమ్మెల్యే మీసం మెలేయడంతో.. వివాదం రాజుకుంది. రెండు వర్గాలు ఘర్షణకు దిగి కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉండటంతో.. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపారు పోలీసులు.