Andhra Pradesh: పౌరసత్వం చట్టసవరణ బిల్లును రద్దు చేయాలి: సీఐటీయూ

ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పేర్కొంది.

Update: 2020-01-20 13:28 GMT

చోడవరం: ప్రత్యేక హోదా విభజన చట్టంలో హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పేర్కొంది. ఈ మేరకు సోమవారం స్థానిక చోడవరంలో సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న, డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్వీ నాయుడు మాట్లాడుతూ... దేశం మతన్మోదుల చేతుల్లోకి పోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి... దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వం చట్టసవరణ బిల్లు దేశాన్ని ఆందోళన వైపు నడిపించిందని ఆరోపించారు. దేశంలోను, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉందని... అధిక ధరలు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.

Tags:    

Similar News