Chandrababu Arrest: రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..
Chandrababu Arrest: విచారణలో పాల్గొననున్న ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ అధికారులు,
Chandrababu Arrest: రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..
Chandrababu Arrest: స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు, రేపు రెండు రోజులు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కోర్టు తీర్పును అనుసరించి జైల్లోనే విచారించేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబును ప్రశ్నించేందుకు ఇవాళ రాజమండ్రికి సీఐడీ బృందం చేరుకోనుంది. సీఐడీ డీఎస్పీ నేతృత్వంలో చంద్రబాబును విచారించనున్నారు. విచారణలో పాల్గొనేందుకు చంద్రబాబు తరఫున ఇద్దరు లాయర్లకు అనుమతిచ్చారు. రెండ్రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారలు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ అధికారులు, ఇద్దరు టైపిస్టులు, ఒక వీడియోగ్రాఫర్ పాల్గొంటారు.