Andhra Pradesh: తిరుపతి ఉపఎన్నికపై సీఎం జగన్ ఫోకస్

Andhra Pradesh: ఆరుగురు మంత్రులకు ఉపఎన్నికకు బాధ్యతలు * తిరుపతి ఉపఎన్నికను సవాల్ గా తీసుకున్న వైసీపీ

Update: 2021-03-04 01:09 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.. మంత్రుల ను ఇంచార్జ్ లుగా నియమించనున్నారు ఆరుగురు మంత్రులు తిరుపతి ఉప ఎన్నికకు ఇంచార్జ్ లుగా ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఈఎన్నికను అధికార పార్టీ సవాల్ తీసుకుంది ఈఎన్నికలో అధికార పార్టీని ఓడించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

వచ్చే నెలలో తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది..దీనికోసం సీఎం జగన్ మంత్రుల ను ఇంచార్జ్ లు గా నియమించనున్నారు..పెద్దిరెడ్డి. బొత్స వంటి సీనియర్లు ఇతర మంత్రులు కలిసి తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి పెడతారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవాలని వైసిపి పట్టుదల తో ఉంది గతంలో వచ్చిన మెజారిటీ నిలబెట్టుకోవాలని ఆలోచనలో ఉంది. ఇందుకోసం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు సీఎం జగన్..వచ్చే వారమే మంత్రులకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.

ఈ నెల10తో మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తర్వాత. తిరుపతి ఉప ఎన్నిక పై దృష్టి పెట్టనుంది వైసిపి మంత్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నా రుఈతిరుపతి ఉప ఎన్నికను అధికార పార్టీ సవాల్ గా తీసుకుంది భారీ మెజారిటీతో గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు ఈఎన్నికలో అధికార పార్టీని ఓడించి ఈప్రభుత్వం ప్రజలలో విఫలమైందని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి ఈ ఉపఎన్నిక ఇటు అధికార పక్షానికి అటు ప్రతిపక్షానికి సవాల్ మారాయి  ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంచార్జ్ మంత్రి నియమించనుంది ప్రభుత్వం

Tags:    

Similar News