ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులకు శ్రీకారం

Update: 2019-09-26 14:26 GMT

పదో తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ప్రస్తుత ప్రశ్నాపత్రంలో ఉన్న 20 శాతం ఇంటర్నల్‌ అసిస్మెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించామని వివరించారు. బిట్‌ పేపర్‌ను ప్రత్యేకంగా కాకుండా.. ప్రశ్నాపత్రంలో భాగంగా బిట్స్‌ ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 45 వేలకు పైగా పాఠశాల్లలో తల్లిదండ్రులతో కమిటీలు ఏర్పాటు చేశామని.. విద్యాహక్కు చట్టం అమలు, ఫీజు నియంత్రణ కోసం కమిటీ పనిచేస్తాయని.. మంత్రి సురేశ్‌ తెలిపారు.  

Tags:    

Similar News