ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ భేటీ

Chandrababu: ఏపీలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

Update: 2024-01-09 04:16 GMT

ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ భేటీ

Chandrababu: ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం సోమవారం రాష్ట్రంలో అడుగుపెట్టింది. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి రాజకీయ పార్టీలతో భేటీలు, ఫిర్యాదుల స్వీకరణ, వాటిపై రాష్ట్ర స్ధాయిలో అధికారులకు సూచనలు చేయడం వంటి కార్యక్రమాలను షెడ్యూల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ సీఈసీని కలిసేందుకు సిద్ధమయ్యారు.

ఇవాళ ఉదయం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇందులో రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపులు, నకిలీ ఓట్లను చేర్చడం, సచివాలయాల సిబ్బందిని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియమించడం, విపక్షాల ఫిర్యాదులను సీఈవో పట్టించుకోకపోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించడంపై ఈసీకి నివేదించాల్సిన అంశాలపై ఇద్దరు నేతలు చర్చి్స్తారు. అనంతరం సీఈసీ వద్దకు బయలుదేరి వెళ్తారు.

విజయవాడలో సీఈసీ రాజీవ్ కుమార్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలపై మరోసారి ఫిర్యాదు చేయనున్నారు. వీటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఈసీని కోరబోతున్నారు. రాష్ట్రంలో నకిలీ ఓట్లపై వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది కీలకంగా మారింది.

అయితే ఇప్పటికే తమ సానుభూతిపరుల ఓట్ల తొలగించారంటూ టీడీపీ, జనసేన ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో ఆ సమస్యలు పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం టీడీపీకి లేఖ రాసింది. మరికొన్ని ఫిర్యాదులు పరిష్కరణ దశలో ఉన్నాయని తెలిపింది. ఇక ఏపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఎన్నికల్లో ఉపయోగించుకోకూడదని ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు మాటలన్నీ ఆరోపణలంటూ అధికార వైసీపీ కొట్టిపారేసింది. అసలు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అంటోంది. కేవలం సచివాలయ ఉద్యోగులే ప్రభుత్వ ఉద్యోగులుగా వెల్లడించింది. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులను ఎలా వాడకూడదని చెబుతారంటూ ప్రతిపక్షాలపై రివర్స్ ఎటాక్ చేస్తోంది.

Tags:    

Similar News