జగన్మోహన్ రెడ్డీ గుర్తుపెట్టుకో, వడ్డీతో సహా చెల్లించేరోజు వస్తుంది : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ హద్దులు దాటి ప్రవర్థిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

Update: 2020-02-04 16:57 GMT
ChandraBabu File Photo

ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ హద్దులు దాటి ప్రవర్థిస్తున్నారని చంద్రబాబు అన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లిన టీడీపీ ప్రభుత్వం అడ్డుకోలేదని.. తమ ప్రభుత్వం అడ్డుకుంటే జగన్ రాష్ట్రలో తిరిగేవారా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో అమరావతి పరిరక్షణ సభలో చంద్రబాబు ప్రసంగించారు. అమరావతిని తరలిస్తారన్న దిగులుతో 37 మంది రైతులు మరణించారని అన్నారు. ప్రభుత్వం అమరావతి తరలింపు గురించి ప్రకటనలు చేయకపోతే వారు చనిపోయేవారు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని కోసం ఇంకా ఎంత మందిని బలితీసుకుంటారని నిలదీశారు. 37 మంది ప్రభుత్వ హత్యలుగా చంద్రబాబు అభివర్ణించారు.

అమరావతి కోసం 49 రోజులుగా రైలుతు నిరసన తెలుపుతుంటే సీఎంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు తీరుకు వడ్డీతో సహా చెల్లించే రోజులు వస్తాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ వారు సభలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఉంటాయి కానీ టీడీపీ సభలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా 'జగన్మోహన్ రెడ్డీ గుర్తుపెట్టుకో, మళ్లీ తొందరల్లోనే నీ రోల్ వస్తుంది..' వడ్డీతో చెల్లించే దగ్గర్లోనే ఉందని చంద్రబాబు హెచ్చరించారు. న్యాయం, ధర్మం తాము పోరాడుతున్నామని చెప్పారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం తాము పోరాటం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రచారం చేస్తున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ హయంలో తాము ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయితే విశాఖ మెగాసిటీగా మారేదని చెప్పారు. తాను స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటే తిరుపతిలో రాజధాని పెట్టేవాడినని, రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించానని తెలిపారు.


  

Tags:    

Similar News