చంద్రబాబు సభలో తొక్కిసలాట.. మహిళ మృతి!
Chandrababu: ఏపీ టీడీపీ కార్యక్రమంలో మరో అపశృతి
చంద్రబాబు సభలో తొక్కిసలాట.. మహిళ మృతి!
Chandrababu: ఏపీ టీడీపీ కార్యక్రమంలో మరోసారి అపశృతి చోటు చేసుకుంది. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో జనతావస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. తోపులాటలో మహిళలు సృహతప్పి పడిపోయారు. జనతావస్త్రాల కోసం మహిళలు భారీగా తరలివచ్చారు. 30వేల మందికి కూపన్లు పంపిణీ చేసిన టీడీపీ నేతలు.. టోకెన్లతో ఉయ్యూరి ఫౌండేషన్ కౌంటర్ కు వెళ్లాలని అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో వస్త్రాలు పంపిణీ చేసే కౌంటర్ వద్దకు మహిళలు పరుగెత్తుకెళ్లారు. కౌంటర్ దగ్గర తోపులాట జరగడంతో.. మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఇటీవల కందుకూరులో ఇదేంఖర్మ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకొని.. 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతలోనే మరో ఘటన చోటు చేసుకుంది.