ఉద్దండరాయునిపాలెంకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాడికొండ నియోజకవర్గం అయిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటిస్తున్నారు.

Update: 2019-12-23 06:43 GMT
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాడికొండ నియోజకవర్గం అయిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఉండవల్లిలో తన నివాసం నుంచి వెళ్లి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తోపాటు ఇతర ప్రముఖులు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేసిన ప్రాంతానికి వెళతారు. అనంతరం అమరావతి రాజధాని ప్రాంత రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు సమాచారం. కాగా చంద్రబాబు పర్యటన సందర్బంగా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు వందమంది పోలీసులు దాకా చంద్రబాబు వెంట వుండనున్నట్టు సమాచారం.

చంద్రబాబుతో కొందరు రైతులు, ప్రజలు సమావేశం అవుతారు. కాగా అమరావతి రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. మార్చి 2, 2017న తాత్కాలిక శాసనసభ ప్రారంభంతో అక్కడినుంచే పరిపాలన మొదలైంది. తాత్కాలిక సచివాలయం, హైకోర్టును కూడా ప్రారంభించారు. అయితే ఈ జగన్ అధికారంలోకి రావడంతో రాజధానిలోని అన్ని విభాగాలను ఇక్కడే పరిమితం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ తెచ్చారు.

Tags:    

Similar News