రేపటినుంచి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Update: 2019-11-05 03:42 GMT

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు నవంబర్ 6 ,8 తేదీల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారు. దీంతో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లాలోని 14 సీట్లలో ఒక సీటు మాత్రమే టీడీపీ గెలుచుకుంది.. దీంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అందువల్ల పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదని చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనతో కేడర్‌ లో నూతనుత్సాహం నింపనున్నారు. కాగా 2020 ప్రారంభంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడానికి కేడర్‌ను రీఛార్జ్ చేసి, యాక్టివేట్ చేయాల్సి ఉందని పార్టీ జిల్లా నాయకత్వం అభిప్రాయపడింది. పార్టీ ఇటీవల అన్ని రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయాల్లో నిరసన ఉపవాసాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఇసుక కొరత ధర్నాలు.. అంతకుముందు, అన్నా క్యాంటీన్లను మూసివేయడాన్ని మరియు ఇతర సమస్యలను నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు టీడీపీ కార్యకర్తలు.

Tags:    

Similar News