సీఎం జగన్‌కు పరిపాలన చేతకావడం లేదు : చంద్రబాబు

జగన్ కు పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. రాజధాని రైతులు ఏకాకులు కాదు వారి వెనక ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు.

Update: 2020-02-05 16:02 GMT
ChandraBabu File Photo

జగన్‌కు దమ్ముంటే అమరావతిపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాలు విసిరారు. జగన్ రాజీనామా చేసి.. మూడు రాజధానులపై రెఫరెండం పెట్టాలన్న బాబు మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అయితే, కేంద్రం చెప్పినట్లు రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికే ఉంటుందని కానీ మార్చే హక్కు మాత్రం ఉండదన్నారు.

ఇండియా మ్యాప్‌లో అమరావతిని నోటిఫై చేశారని గుర్తుచేసిన చంద్రబాబు.... అమరావతి కేంద్రంగా హైకోర్టు ఇస్తున్నామని రాష్ట్రపతి చెప్పారని తెలిపారు. స్వయంగా సీజే వచ్చి అమరావతిలో ప్రమాణస్వీకారం చేశారని వెల్లడించారు. జగన్ మూడు అంటే.. ఇంకొకరు ముప్పై రాజధానులు అంటున్నారు. అధికార వికేంద్రీకరణ ఎక్కడా జరగలేదు.. మూడు రాజధానులు ఎక్కడా లేవు. అందరూ జగన్ తీరు చూసి నవ్వు కుంటున్నారు.

జగన్ కు పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. రాజధాని రైతులు ఏకాకులు కాదు వారి వెనక ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు. సీఎంకు దమ్ముంటే మందడం రావాలని సవాల్ విసిరారు. పోలీసులు ఉంటే తప్ప బయటకు రాలేని పరిస్థితి సీఎం జగన్‌దని ఎద్దేవా చేశారు. జగన్ ఎంత త్వరగా అధికారంలోకి వచ్చారో అంతే త్వరగా తెరమరుగవుతారని జోస్యం చెప్పారు. రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అధికార మార్పిడి జరిగిందని దీంతో వైసీపీ వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. విశాఖ ప్రజలు అధికార వికేంద్రీకరణ కోరలేదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుతున్నారని చంద్రబాబు అన్నారు. 


Tags:    

Similar News