AP High Court: చంద్రబాబు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా
AP High Court: టీడీపీ ఖాతాలోకి వచ్చిన నిధులు వివరాలు ఇవ్వడం లేదన్న సీఐడీ
AP High Court: చంద్రబాబు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా
AP High Court: ఏపీ హైకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసుపై విచారణ జరిగింది. చంద్రబాబు బెయిల్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు హెల్త్ ట్రీట్‌మెంట్, కంటి ఆపరేషన్ వివరాలను..ఏపీ హైకోర్టుకు అందజేశారు చంద్రబాబు తరఫు లాయర్లు. 5 వారాల పాటు ఐ చెకప్ కోసం డాక్టర్లు షెడ్యూల్ ఇచ్చారు. 5 వారాలు కంటిలో చుక్కల మందులు వేసుకోవాలని సూచించారని తెలిపారు. చంద్రబాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని... చంద్రబాబు గుండె సైజు పెరిగిందని వైద్యులు సూచించారు. గుండెకు రక్త సరఫరాలో సమస్యలు ఉన్నాయన్న వైద్యులు.. చంద్రబాబుకు తగిన విశ్రాంతి అవసరమని తెలిపారు. చంద్రబాబు బెయిల్‌పై అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ.. కండీషనల్ బెయిల్ వచ్చాక విచారణను అడ్డుకుంటున్నారని తెలిపింది. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. విచారణకు సైతం చంద్రబాబు సహకరించడం లేదన్నారు.