Vidadala Rajini: ఆరోగ్య శ్రీ గురించి చంద్రబాబు, లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదు..

Vidadala Rajini: టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలి..?

Update: 2023-07-08 10:28 GMT

Vidadala Rajini: ఆరోగ్య శ్రీ గురించి చంద్రబాబు, లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదు

Vidadala Rajini: వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు చేస్తున్నారని తెలిపారు మంత్రి విడుదల రజనీ. కృష్ణా జిల్లా గుడివాడలో 10 కోట్ల 28 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌ను ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి మంత్రి ప్రారంభించారు. వైసీపీ హయాంలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ది పొందాయన్నారు. ఇక టీడీపీ నేతలపైనా విమర్శనాస్త్రాలు సంధించారు విడుదల రజనీ. ఆరోగ్య శ్రీ గురించి చంద్రబాబు, లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. మ్యానిఫెస్టో అంటూ డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు.. దమ్ముంటే టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు మంత్రి విడదల రజని. 

Tags:    

Similar News