ఏలూరు జిల్లా పోలవరంలో కేంద్ర బృందం పర్యటన
ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించనున్న సెంట్రల్ టీమ్ బృందంలో కేంద్ర జలసంఘం పరిశోధన విభాగం ఎక్స్అఫిషియో సభ్యుడు ఆదిత్య శర్మ..
ఏలూరు జిల్లా పోలవరంలో కేంద్ర బృందం పర్యటన
ఏలూరు జిల్లా పోలవరంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర జలసంఘం పరిశోధన విభాగం ఎక్స్అఫిషియో సభ్యుడు ఆదిత్య శర్మ.. చీఫ్ ఇంజినీర్ భక్షి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాంతో కూడిన ఈ టీమ్.. ప్రాజెక్టు నిర్మాణ తీరును పరిశీలించనుంది. ఇప్పటికే సెంట్రల్ టీమ్ రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లతో భేటీ అయింది. కేంద్రం ఆమోదించిన డిజైన్ల ఆధారంగా పనుల పురోగతిపై చర్చిస్తుంది. అనంతరం డయాఫ్రమ్ వాల్.. గ్యాప్ 1, 2.. ఈసిఆర్ఎఫ్ నిర్మాణాలను పరిశీలించనుంది కేంద్ర బృందం.