TS And AP: డిస్కంలకు షాక్.. ఎక్స్ఛేంజీల్లో కరెంటు కొనకుండా కేంద్రం నిషేధం

TS And AP: తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు..

Update: 2022-08-19 02:20 GMT

TS And AP: డిస్కంలకు షాక్

TS And AP:  తెలుగు రాష్ట్రాలు సహా.. 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థల, ఇంధన ఎక్స్చేంజ్‌ల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొన్న కరెంటుకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించలేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల డిస్కంలు ఎక్స్చేంజీ ద్వారా విద్యుత్ కొనుగోలు, మిగులు విద్యుత్ అమ్మకాలకు నేటి నుంచి అవకాశం ఉండదు. చర్యలను ఉపసంహరించే వరకు డిస్కంలు ఇదే పరిస్థితిని ఎదుర్కోనున్నాయి.

కేంద్రం నిషేధం విధించిన వాటిలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, జమ్ము-కశ్మీర్, బిహార్, ఝార్ఖండ్, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాల డిస్కంలు కూడా ఉన్నాయి. ఇక నిషేధం వల్ల తలెత్తే లోటు కారణంగార రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం ఉంది.

ఎల్‌పీఎస్ నిబంధనల్లో భాగంగా ప్రత్యేక పోర్టల్‌ను కేంద్రం రూపొందించింది. ఇందులో వివిధ రాష్ట్రాల డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్.. చెల్లించాల్సిన బిల్లు మొత్తాలను విద్యుదుత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జులై, ఆగస్టు నెలల్లో డిస్కంలు తీసుకున్న విద్యుత్ బిల్లులను ఇంధన ఉత్పత్తి సంస్థలు అప్‌లోడ్ చేశాయి. అప్‌లోడ్‌ చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని బకాయిలున్నాయంటూ కేంద్రం చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News