దిశచట్టం బిల్లుకు ఏపి శాసనసభ ఆమోదం

మహిళ భద్రత కోసం ‘దిశ చట్టం 2019’ ని తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి దిశ చూపించారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా శాసనసభ్యులు వ్యాఖ్యానించారు.

Update: 2019-12-14 04:50 GMT
సుచరిత, పుష్పశ్రీవాణి, తానేటి వనిత, ఉండవల్లి శ్రీదేవి,వాసిరెడ్డి పద్మ, కళావతి

నెల్లూరు: మహిళ భద్రత కోసం 'దిశ చట్టం 2019' ని తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికి దిశ చూపించారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. శుక్రవారం దిశ చట్టానికి ఏపీ అసెంబ్లీ ఆమోదించడంతో మహిళా మంత్రులు, సభ్యులు మీడియా పాయింట్‌లో కేక్‌ కట్‌ చేసి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. మహిళ రక్షణ పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్త శుద్ధికి దిశ చట్టం నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరగకపోయినా మహిళ రక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు.దీనికి రాష్ట్ర మహిళా లోకమంతా రుణపడి ఉంటుందన్నారు. అలాగే సోషల్‌ మీడియాలో మహిళల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా పోస్టింగులు పెట్టే వారికి కూడా ఈ చట్టం ద్వారా రెండు నుంచి నాలుగేళ్ల జైలు శిక్ష, అదే సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడి వంటి సంఘటనల విషయాల్లో ఉరి శిక్షను అమలు చేయనున్నట్లు తెలిపారు.

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ...దిశ చట్టం తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో దిశచట్టంపై జాతీయ స్థాయిలో మహిళా సదస్సును నిర్వహించడం ద్వారా కేంద్ర చట్టాల్లో కూడా మార్పులు తీసుకువచ్చే విధంగా ఒక డిక్లరేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత, వైసీపీ మహిళా ఎమ్మల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కళావతి పాల్గొన్నారు.


Tags:    

Similar News