Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ సంచలన వ్యాఖ్యలు.. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తు కొనసాగిస్తాం- సీబీఐ

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది.

Update: 2025-09-16 10:22 GMT

Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తును కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తును కొనసాగిస్తామని పేర్కొంది.

అయితే, నిందితుల బెయిల్ రద్దు అంశంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో కేసులో తదుపరి విచారణ ట్రయల్ కోర్టు పరిధిలోకి వెళ్లనుంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి పలువురు నిందితులను అరెస్ట్ చేయడం, వారికి బెయిల్ లభించడం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు సీబీఐ చేసిన తాజా ప్రకటన కేసు విచారణలో మరో కీలక పరిణామంగా మారింది.

Tags:    

Similar News