Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
Andhra Pradesh News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది.
Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
Andhra Pradesh News: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అరెస్ట్ చేసింది. గీతా దంపతులు విశ్వేశ్వర ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 42 కోట్ల 79 లక్షల రూపాయల రుణం తీసుకుని ఎగవేసినట్లు అభియోగాలున్నాయి. డబ్బులు దారి మళ్లించారని సీబీఐ కేసు నమోదు చేసింది. కొత్తపల్లి గీతను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. వీరితో పాటు బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌కూ ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2లక్షల జరిమానా విధించింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ఆమె తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.