వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదు

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2019-08-12 09:05 GMT

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై దుర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత రాత్రి ఎమ్మెల్యే సహా, అతడి అనుచరులు తనపై దాడి చేశారని 'జమీన్‌ రైతు' వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News