Vijayawada: విజయవాడలో కారు బీభత్సం.. యువకుడి మృతి
Vijayawada: ఎమ్మెల్సీ ప్రధాన అనుచరుడు నజీర్ డ్రైవింగ్ చేసినట్లుగా గుర్తించిన పోలీ
Vijayawada: విజయవాడలో కారు బీభత్సం.. యువకుడి మృతి
Vijayawada: విజయవాడ BRTS రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. BRTS రోడ్ భానునగర్ కేంద్రీయ విద్యాలయం సమీపంలో బైకును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే పావులపల్లి లక్ష్మణరావు అనే యువకుడు మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి పార్ట్ టైం బైక్ టాక్సీ నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ప్రధాన అనుచరుడు నజీర్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ప్రధాన అనుచరుడు నజీర్ పరారీలో ఉన్నాడు. కానీ పోలీస్ చలాన్లలో కార్ కు స్టిక్కర్ ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా కారుపై 7 పెండింగ్ చలాన్లు కూడా ఉన్నాయి.