East Godavari: చెట్టును ఢీకొన్న కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
East Godavari: *క్షతగాత్రులు రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలింపు *రాజమండ్రి నుండి చిత్తూరు వెళ్తుండగా ఘటన
East Godavari: చెట్టును ఢీకొన్న కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి
East Godavari: తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చెట్టును కారు బలంగా ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాజమండ్రి నుండి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.