Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

Tirumala: రెండవ ఘాట్‌ రోడ్డులో విరిగిపడ్డ బండరాళ్లు, చెట్లు

Update: 2021-12-01 05:10 GMT
తిరుమల ఘాట్ రోడ్ పై విరిగిపడ్డ కొండా చర్యలు

Tirumala: తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఘాట్‌ రోడ్డులో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుపై పడటంతో రహదారి కోతకు గురైంది. రెండో ఘాట్‌ రోడ్డులోని చివరి మలుపు వద్ద భారీగా చీలికలు ఏర్పడ్డాయి. రోడ్డు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. టీటీడీ ఇంజినీరింగ్‌, విజిలెన్స్‌ సిబ్బంది భక్తులకు ఇబ్బంది కాకుండా చర్యలు చేపట్టారు.

కాగా ఇటీవల తిరుమలలో భారీ వర్షాలు కురిసాయి. ఆసమయంలో రెండు ఘాట్‌ రోడ్లలో చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వాస్తవానికి 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తిరుపతిని వర్షాలు చుట్టుముట్టాయి. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్‌ డ్యామ్‌లు పొంగి పోయాయి. ఈ వర్షాల కారణంగా తిరుమలలో 4 కోట్లకుగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News