Botsa Satyanarayana: లోకేష్ పాదయాత్ర జాగ్రత్తగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది
Botsa Satyanarayana: లోకేష్ పాదయాత్రను ఎవరు గుర్తిస్తారు
Botsa Satyanarayana: లోకేష్ పాదయాత్ర జాగ్రత్తగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది
Botsa Satyanarayana: అరసవల్లి సూర్య నారాయణస్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ పాదయాత్ర జాగ్రత్తగా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని.. ఏమైనా తేడా వస్తే ఆరోగ్యం చెడిపోతుందని హితవు పలికారు. రాజకీయాల్లో పరిణితి చెందిన అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. అచ్చెన్నాయుడు ప్రజా జీవితంలో ఉన్నారో లేక బైట ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. మాట్లాడితే ఏక వచనం.. లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని తెలిపారు. ఇలాంటి వారి వల్ల ప్రజల్లో రాజకీయ నాయకులు పలచన అవుతున్నారన్నారు మంత్రి బొత్స. వ్యవస్థలను గౌరవిస్తూ పరిమితుల్లో మాట్లాడాలన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను సభ్య సమాజం హర్షించడం లేదన్నారు బొత్స. లోకేష్ పాదయాత్రకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తామన్న ఆయన అనుమతి ఉంది కదా అని రోడ్డు మీద ఊరేగం కదా అన్నారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని.. లోకేష్ పాదయాత్రను ఎవరు గుర్తిస్తారని మండిపడ్డారు.