Botsa Satyanarayana: వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులపై బొత్సా ఆగ్రహం

Botsa Satyanarayana: స్థానిక ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తుండగా మండిపాటు

Update: 2023-04-09 08:00 GMT

Botsa Satyanarayana: వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులపై బొత్సా ఆగ్రహం

Botsa Satyanarayana: విజయనగరం శృంగవరపుకోట నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులకు మంత్రి బొత్స సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు. ఆసరా కార్యక్రమం ముగించుకొని వెళుతుండగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పై ఫిర్యాదు చేయడానికి కాన్వాయ్ దగ్గరకు వెళ్లిన నాయకుల పై బొత్స మండిపడ్డారు. ఫిర్యాదు చేయడానికి ఇది సమయంకాదన్నారు. విజయనగరం వచ్చి ఫిర్యాదు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డ బొత్సా జరుగుతున్న తతంగాన్ని వీడియో తీస్తున్న జర్నలిస్టుపై కెమెరా ఆపాలంటే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News