జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పిన బొండా ఉమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చెస్తున్నాయి.

Update: 2020-02-18 16:06 GMT
Bonda Uma File Photo

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చెస్తున్నాయి. టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు జగన్‌ హస్తినా పర్యటనపై పలు ఆరోపణలు చేశారు. రస్‌అల్‌ఖైమా కేసులో ఎలాంటి ఇబ్బంద్దులు రాకుండా ఉండేందుకే ప్రధాని నరేంద్రమోదీతో జగన్ భేటీ అయ్యారని అన్నారు.

ఇతర దేశాలు వెళ్లినా జగన్ అరెస్టు అవుతారని, దుబాయ్‌లో పెట్టుబడుల సదస్సుకు జగన్‌ వెళ్లకపోవడానికి కారణం కూడా అదే అన్నారు. ఇతర దేశాల్లో తనపై ఉన్న కేసుల గురించే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. నిమ్మగడ్డ అప్రువర్‌గా మారినట్టు తెలుస్తోందని, నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టుతో వైసీపీ కంగారుపడుతోందన్న బొండా ఉమా ఆరోపించారు. 14 మందిపై దుబాయ్‌ ప్రభుత్వం నిఘా పెట్టిందని, కేంద్రంపై నిందితులను అప్పగించాలని ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని బొండా ఉమా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News