Andhra Pradesh: అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం
Andhra Pradesh: నాటు బాంబులు విక్రయిస్తున్న ఇద్దరూ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
నాటు బాంబులు (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: అనంతపురం జిల్లా కదిరిఅనంతపురం తనకల్లు మండలం ఎగువబత్తిని వారి పల్లి లో నాటు బాంబులు కలకలం రేపాయి. నాటు బాంబులు విక్రయిస్తున్న ఇద్దరూ వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తనకల్లు పోలీసులు 20 నాటు బాంబులు స్వాధీనం. కదిరి డి.ఎస్.పి భవ్యకిషోర్ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు ఎగువ బత్తిన వారిపల్లి లో ముద్దాయిలను అరెస్ట్ చేసారు. ఎగువబత్తిన వారి పల్లి కి చెందిన గంగన్నఅనే వ్యక్తి అడవి పందులను వేటాడుతూ ఉంటాడు. నల్ల మందు తో తయారు చేసే నాటు బాంబులను ఆహారంలో కలిపి అడవుల్లో పెడతాడు. అవి నోట్లో తీసుకున్నపుడు అవి పేలి చనిపోతాయి. తరువాత వాటి మాంస విక్రయం చేస్తాడు.
ఈ క్రమంలో నాటు బాంబులు విక్రయించే అనంతపురం కు చెందిన దశరధ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతను కర్ణాటక నుంచి నల్ల మందు తెచ్చి అనంతపురం లో నాటు బాంబులు తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ మధ్యమాలోనే తనకల్లులో గంగన్నకు విక్రయించాల్సి ఉండగా ప్లాస్టిక్ బకెట్ లో తరలిస్తున్న బాంబులను పోలీసులు చాకచక్యంగా ఇద్దరు ముద్దయిలను పట్టుకున్నారు.