Andhra News: నెల్లూరు జిల్లాలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
Andhra News: గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు
Andhra News: నెల్లూరు జిల్లాలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
Andhra News: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ చెరువులో బోటు షికారుకు వెళ్లిన పడవ బోల్తా పడింది. పడవలో 10మంది ప్రయాణిస్తుండగా... ఆరుగురు గల్లంతు కాగా... నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. సరదాగా చెరువులో పడవలో షికారు వెళ్లగా... ప్రమాదవశాత్తు పడవ తిరగబడింది. గల్లంతైన ఆరుగురిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు, ఇద్దరు ఐటీ ఉద్యోగులు, మరో ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులున్నారు. గాలింపు చర్యలను జిల్లా ఎస్పీ విజయరావు పర్యవేక్షించారు. గల్లంతైన వారిలో కళ్యాణ్ మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.