BJP: ఇవాళ విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
BJP: తిరుపతి ఉపఎన్నిక తర్వాత తొలిసారిగా జరగనున్న కార్యవర్గ సమావేశం
బీజేపీ (ఫైల్ ఇమేజ్)
BJP: ఇవాళ విజయవాడలో ఏపీ బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరగనున్నది. తిరుపతి ఉపఎన్నిక తర్వాత తొలిసారిగా బీజేపీ నేతలు రాష్ర్ట కార్యవర్గసమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ సహా పార్టీ రాష్ర్ట ఇంచార్జ్ సునీల్ దేవధర్, సోము వీర్రాజుతోపాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ఉద్యోగ క్యాలెండర్, కొత్త ఇసుక పాలసీ, నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వివాదంపై చర్చించనున్నారు. రాజకీయ తీర్మానం, వ్యవసాయ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు.