జేసీ దివాకర్ రెడ్డితో సీఎం రమేష్, బీటెక్ రవి భేటీ.. ఇద్దరూ జంపా?

టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇంచార్జి, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి (బీటెక్ రవి) రహస్యంగా భేటీ అయ్యారు.

Update: 2020-04-09 02:01 GMT
CM ramesh, Jc diwakar reddy and mlc btech ravi

టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇంచార్జి, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి (బీటెక్ రవి) రహస్యంగా భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు వద్ద ఉన్న జేసీ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటలపాటు ఫామ్ హౌస్ లో చర్చలు జరిపారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

జేసీ, బీటెక్ రవి ని బీజేపీలోనికి ఆహ్వానించడానికే సీఎం రమేష్ కలిసి ఉంటారని రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఇది వరకే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.. ఈ క్రమంలో వీరంతా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని ఇందులో రాజకీయాలు లేవని జేసీ దివాకర్ రెడ్డి చేబుతున్నారు.. పాత స్నేహితులు కాబట్టే కలిశామని చెప్పారు.

తాను వ్యవసాయ తోటలో ఉన్నందునే కలవటానికి సీఎం రమేష్, బీటెక్ రవి వచ్చారని జేసీ స్పష్టం చేశారు. కానీ లాక్ డౌన్ సమయంలో ఏ రాజకీయ కారణం లేకుండా వీరు కలవరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News