పవన్ సభలో పాల్గోనాల్సిన అవసరం లేదు : బీజేపీ నేత విష్ణు

వరదల కారణంగా ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.. ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది.

Update: 2019-10-31 05:07 GMT

వరదల కారణంగా ప్రస్తుతం ఏపీలో ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే.. ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికులకు ఉపాధి కరువైంది. ఇసుక కొరతకు వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇసుక కొరతను నిరసిస్తూ నవంబర్ 3వ తేదీన లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పలు పార్టీలను పవన్ కోరారు. ఇటు బీజేపీని కూడా ఆయన అభ్యర్ధించారు. అయితే పవన్ కళ్యాణ్ సభలో పాల్గొనడానికి బీజేపీ అయిష్టత కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షుడు, నెహ్రు యువ కేంద్ర వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. 'ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గారు పవన్ సభలో పాల్గోనాల్సిన అవసరం బీజేపీకి లేదు. ఇసుక సమస్య పై మొదటి నుండి పోరాడుతుంది బీజేపీ. ముఖ్యమంత్రి కి లేఖ రాసింది మొదట బీజేపీనే. ఇసుక సమస్య పై గవర్నర్ ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది బీజేపీ. బీజేపీ ఆధ్వర్యంలో నవంబర్ 4న విజయవాడ లో కన్నా గారి అధ్యక్షుతన పెద్దఎత్తున మరోసారి ఆందోలన చేపడతాము' అంటూ విష్ణువర్ధన్ రెడ్డి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News