Kanna Lakshminarayana: మూడున్నరేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలి
Kanna Lakshminarayana: యాత్రలో ఏం జరిగినా జగన్ బాధ్యత వహించాలి
Kanna Lakshminarayana: మూడున్నరేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలి
Kanna Lakshminarayana: ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ ప్రజాపోరు యాత్ర జరుపుతున్నామని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. అక్టోబర్ 2 వరకు రాష్ర్టంలోని స్ట్రీట్ కార్నర్స్ లో మీటింగులు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ సిద్ధాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధి అని, దోచుకోవడం కాదన్నారు. మూడున్నరేళ్ల పాలన ఎలాంటి అభివృద్ధి చేశారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి యాత్రకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, ఈ యాత్రలో ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాల్సి వస్తుందని కన్నా హెచ్చరించారు.