By Election: తిరుపతి బరిలో బీజేపీ: ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్
Tirupati By Election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన, బీజేపీ మిత్రపక్షం అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది.
జనసేన అధినేత పవన్ తో మాట్లాడుతున్న ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోమూ వీర్రాజు (ఫొటో ట్విట్టర్)
Tirupati By Election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన, బీజేపీ మిత్రపక్షం అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించారు. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ట్వీట్ చేశారు.
జనసేన అధినేత పవన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మురళీధరన్ స్పష్టం చేశారు. బీజేపీ, జనసేనలు కలిసి వైసీపీ, టీడీపీలను ఓడిస్తాయని మురళీధరన్ ధీమా వ్యక్తం చేశారు.