Vijayawada: విజయవాడలో బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం

Vijayawada: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించిన ఇరు పార్టీల నేతలు * ఉమ్మడిగా పనిచేయాలని బీజేపీ, జనసేన నాయకుల నిర్ణయం

Update: 2021-08-15 02:13 GMT

విజయవాడలో బీజేపీ మరియు జన సేన సమన్వయ కమిటీ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Vijayawada: ప్రజా సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలని బీజేపీ, జనసేన నాయకులు నిర్ణయించారు. భవిష‌్యత్‌లో ఇరు పార్టీలు ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సంకల్పించారు. విజయవాడలో బీజేపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వం పరిపాలనా పరంగా ఎలాంటి ప్రణాళికలు లేకుండా అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న అంశంపై చర్చించారు. ఆర్థికపరమైన అంశాల్లో ఏపీ ప్రభుత్వ తీరుతెన్నులు, నిబంధనల ఉల్లంఘనల గురించి కేంద్రానికి ఫిర్యాదులు అందిన నేపథ్యం గురించి ఈ సమావేశంలో చర్చించారు.

అలాగే కరోనా సెకండ్ వేవ్ మూలంగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులపై చర్చించారు. థర్డ్ వేవ్ విషయంలో అప్రమత్తత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. త్వరలో విస్తృత స్థాయిలో మరోసారి సమన్వయ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశంలో జనసేన తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు. బీజేపీ తరఫున పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్‌ దేవధర్‌ పాల్గొన్నారు.

Tags:    

Similar News