ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు అధికమయ్యాయి
* దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి పదవికి రాజీనామా చేయాలి * హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి-రమేష్ నాయుడు
BJP Leader Ramesh Naidu
ఏపీలో గడిచిన ఇరవై నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఒంగోలు పార్లమెంట్ బిజెపి ఇన్‌చార్జి రమేష్ నాయుడు ఆరోపించారు. రాష్ర్ట కేబినెట్ లో అన్యమతస్తులు అధికమయ్యారని అన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించిన వారిపై అవకాలు చవాకులు పేలుతున్నారని వాపోయారు. ఆలయాలను పరిరక్షించడంలో విఫలమైన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి తన పదవికి రాజీనామా చేసి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.