కరోనా కట్టడికి భారతి సిమెంట్స్‌ భారీ విరాళం

కరోనా కట్టడికి సామాన్యులు, సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.

Update: 2020-04-02 09:37 GMT

కరోనా కట్టడికి సామాన్యులు, సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి రూ. 5 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) ప్రకటించింది.కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం సహాయనిధికి ఈ విరాళాన్ని అందించారు.

అంతేకాదు భారతి సిమెంట్స్‌ కు చెందిన ఉద్యోగులు 14.5 లక్షల విరాళాన్ని కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. మరోవైపు వర్షిని చారిటబుల్‌ ట్రస్ట్‌ కూడా రూ.1.10 కోట్లు విరాళం ప్రకటించింది. కాగా భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి చైర్ పర్సన్ గా ఉన్నారు. కడప జిల్లా యర్రగుంట్లలో భారతి సిమెంట్స్ కర్మాగారం ఉంది. ఇదిలావుంటే ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య 132 కు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ తెలిపింది.


Tags:    

Similar News