Srisailam: శ్రీశైలంలో ఎలుగుబంటి బీభత్సం.. ప్రొటెక్షన్ వాచర్‌పై దాడి
Srisailam: శ్రీశైలంలో ఎలుగుబంటి బీభత్సం.. ప్రొటెక్షన్ వాచర్‌పై దాడి
Srisailam: శ్రీశైలంలో ఎలుగుబంటి బీభత్సం.. ప్రొటెక్షన్ వాచర్‌పై దాడి
Srisailam: శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి గేటు వద్ద విధులు నిర్వహించే ప్రొటెక్షన్ వాచర్‌పై ఎలుగుబంటి దాడి చేసింది. సాయంత్రం తన విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలో ఆకస్మాత్తుగా ఎలుగుబంటి అతనిపై దాడికి పాల్పడింది. దీంతో అతను కిందపడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే భక్తులు, వాహనదారులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఒంటరిగా వెళ్లొద్దని, వన్యప్రాణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.