సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయేషామీరా తల్లిదండ్రుల లేఖ
Ayesha Meera Case: ఆయేషామీరా హత్య జరిగి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని లేఖలో ఆవేదన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయేషామీరా తల్లిదండ్రుల లేఖ
Ayesha Meera Case: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయేషామీరా పేరెంట్స్ లేఖ రాశారు. ఆయేషా మిరా కేసులో న్యాయాన్ని సమాధి కానివ్వద్దంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. తమ పాప చంపబడి 14 ఏళ్లు గడిచినా... న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రాసిన లేఖను సీజేఐ చదవాలని విన్నవించారు.
సీబీఐ కూడా ఈ కేసులో న్యాయం చేస్తుందనే నమ్మకం తమకు లేదన్నారు. CBI అడిగితే రెండేళ్ళ క్రితం తమ పాప శరీర అవయువాలు ఇచ్చామని.. ఇంతవరకు తిరిగి ఇవ్వలేదన్నారు. కొందరు పోలీసులు, రాజకీయ నేతలు, డబ్బున్న వాళ్లు కుమ్మక్కై తమకు అన్యాయం చేశారన్నారు. ఆయేషామీరా కేసును సీఎం పట్టించుకోవాలన్నారు ఆయేషామీరా పేరెంట్స్.