భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం
కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నం
భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం
Akhila Priya bodyguard: భూమా అఖిల ప్రియ వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. గతంలో నారా లోకేష్ పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై బాడీగార్డ్ నిఖిల్ చేయి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి మనుషులు పథకం ప్రకారం నిఖిల్ పై హత్యాయత్నం చేసినట్టు భూమా అఖిలప్రియ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న జిల్లా ఎస్పీ బాధితున్ని విచారిస్తున్నారు.