ధనుర్మాస ఉత్సవాలకు ఉపమాక వెంకన్న ఆలయంలో అంతా సిద్ధం

ప్రసిద్ద పుణ్యక్షేత్రం, తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఉపమాక వేంకటేశ్వర ఆలయం నందు ధనుర్మాస ఉత్సవాలకు సర్వ సిద్దం చేశామని ఆలయ సూపరింటెండెంట్ ఎన్.హరిబాబు తెలిపారు.

Update: 2019-12-17 04:04 GMT

పాయకరావుపేట: ప్రసిద్ద పుణ్యక్షేత్రం, తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఉపమాక వేంకటేశ్వర ఆలయం నందు ధనుర్మాస ఉత్సవాలకు సర్వ సిద్దం చేశామని ఆలయ సూపరింటెండెంట్ ఎన్.హరిబాబు తెలిపారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నెల రోజుల పాటు గోదాదేవి అమ్మవారి తిరుప్పావై వ్రత మహోత్సవాలను ఇక్కడి ఆలయంలో నిర్వహిస్తారు. ధనుర్లగ్న ప్రారంభ సూచికగా గరుడాద్రి పర్వతంపై గల కల్కి వేంకటేశ్వర స్వామికి సోమవారం ఉదయం నిత్య అభిషేకాలు నిర్వహించారు.

కొండదిగువున గల స్వామి వారి ఉత్సవమూర్తులు, గోదాదేవి అమ్మవారికి తిరుమంజనాలు చేసి నూతన వస్త్ర అలంకరణలు చేశారు. గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై పాశురాలను రోజుకు ఒక్కటి చొప్పున నెల రోజులు పాటు విన్నపాలు చేసి ప్రత్యేక నీరాజన మంత్ర పుష్పాలు విశేష ప్రసాదములు నివేదనలు చేస్తారు. దేవాలయంలో ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్ధం చలువ పందిరులు (పెండాల్స్) ఏర్పాటు చేశామని హరిబాబు చెప్పారు. 

Tags:    

Similar News