దసరా ఉత్సవాలకు బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఏర్పాట్లు!

Vijayawada kanukadurga Temple : పర్వదినం అంటేనే అందరూ సరదాగా కలుసుకొని కబుర్లు కలబోసుకుని ఆనందంగా గడిపే మధుర ఘట్టం. దురదుష్టవశాత్తు, కరోనా మహాసంక్షోభం దాపురించాక సమూహ సంబరాలైన భారతీయ పండుగల పమార్థం అనర్థహేతువుగా మారిపోయింది.

Update: 2020-10-16 02:56 GMT

Vijayawada kanukadurga Temple : పర్వదినం అంటేనే అందరూ సరదాగా కలుసుకొని కబుర్లు కలబోసుకుని ఆనందంగా గడిపే మధుర ఘట్టం. దురదుష్టవశాత్తు, కరోనా మహాసంక్షోభం దాపురించాక సమూహ సంబరాలైన భారతీయ పండుగల పమార్థం అనర్థహేతువుగా మారిపోయింది. పంగల వేళ ప్రజానీకం అప్రమత్తం కాకపోతే ముప్పు మరింత ముమ్మరిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభంలో దరస ఉత్సవాలు నిర్వహించడానికి అధికారులు ఏలాంటి చర్యలు చేపట్టారు. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటీ?...

కనిపించని శత్రువుతో మానవాళి జీవన్మరణ సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తోంది. విశ్వవ్యాప్తంగా మూడున్న కోట్లకు పైబడిన కేసులు, పదిన్నర లక్షలకు చేరవతున్న మరణాలు... కరోనా సంక్షోభ విస్తృతిని చాటుతున్నాయి. దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కేసుల సంఖ్య భీతావహ వాతావరణాన్ని కళ్లకు కడుతోంది. ఇలాంటి సంక్షోభంలో పంగడ వేళ జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు మరింత ముదిరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కరోనాతో పండుగలన్నీ ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కోవిడ్‌ నిందనలతో పండులగ ఆనందమంతా చాలా ఇరుకైపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దసరా ఉత్సవాలకు బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా వినాయకుడి గుడి వద్ద క్యూలైన్‌ ఏర్పాటు చేశారు. మాస్క్‌ లేకుంటే అనుమతించమని హెచ్చరించారు.

టైమ్‌ స్లాట్‌ ప్రకారం దర్శనానికి రావాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. ప్రతి గంటకు క్యూ లైన్‌లు శానీటైజ్‌ చేస్తామని చెప్పారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటకు వరకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. మూల నక్షత్రం రోజు మాత్రం తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు.

ఇక తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా నవరాత్రి ఉత్సవాలలో ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం 9 రోజుల్లో దుర్గమ్మ 10 అలంకారాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏ రోజు ఏ అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే వైదిక కమిటీ ఫైనల్ చేసింది.

ఇక దసరా రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. అయితే ఈ తెప్పోత్సవానికి సైతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు..

Tags:    

Similar News