Army Jawan Sai Teja: బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సాయితేజ భౌతికకాయం
Army Jawan Sai Teja: కర్ణాటక బోర్డర్ నుంచి భారీ బైక్ ర్యాలీకి యువత సన్నాహాలు...
Army Jawan Sai Teja: బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సాయితేజ భౌతికకాయం
Army Jawan Sai Teja: డీఎన్ఏ టెస్టుల కారణంగా ఆలస్యమైన సాయితేజ పార్ధివదేహం ఎట్టకేలకు స్వగ్రామం చేరుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ నుంచి బెంగుళూరు ఎయిర్ పోర్టుకు సాయితేజ పార్ధివదేహం చేరుకుంది. ఈరోజు బెంగుళూరు ఎయిర్‌బేస్‌లోని మార్చురీలోనే సాయితేజ పార్ధివదేహం ఉంచనున్నారు.
అనంతరం రేపు ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన చిత్తూరు జిల్లా ఎగువరేగడికి చేరుకోనుంది. ఇదే సమయంలో కర్ణాటక ఆంధ్ర బోర్డర్‌లో ఘన నివాళులు అర్పించేందుకు యువకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక.. సాయితేజ పార్ధివదేహం ఎగువరేగడ చేరుకున్న తర్వాత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.