ఆర్టీసీ కార్గో...ఇక ఇంటింటికి బట్వాడా
ఆర్టీసీలో కార్గో విభాగం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన సరుకు రవాణా ఆదాయంలో పయనిస్తుందని కార్గో జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.
కడప: ఆర్టీసీలో కార్గో విభాగం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన సరుకు రవాణా ఆదాయంలో పయనిస్తుందని కార్గో జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సంవత్సరము ఏప్రిల్ నుండి నవంబర్ వరకు 2.98 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు. గత ఏడాది కన్నా 15 లక్షల ఆదాయంతో ముందంజలో ఉందన్నారు.
త్వరలో కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సామాగ్రిని బట్వాడా చేసే విధానాన్ని అమలు పరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, రాజంపేట, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, వేంపల్లె, పోరుమామిళ్ల ప్రాంతాలలో కార్గో నడుస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 1.60 లక్షల వ్యాపారం జరుగుతుందని పేర్కొన్నారు.