Weather Update: అల్పపీడనం ప్రభావం, ఇవాళ భారీ వర్షాల సూచన
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాల హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.